close
Choose your channels

'హ‌లో..' రీ షూట్ చేస్తున్నారా?

Monday, September 3, 2018 • తెలుగు Comments

`హ‌లో..` రీ షూట్ చేస్తున్నారా?

రామ్ హీరోగా రూపొందుతోన్న హ‌లో గురూ ప్రేమ కోస‌మే సినిమా రీ షూట్స్ జ‌రుగుతున్నాయా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు.

'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం తరువాత  రామ్ నటిస్తున్న చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’.  త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'లో రామ్‌కు జోడీగా న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాలోనూ రామ్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఎక్కువ భాగాన్ని గోదావ‌రి జిల్లాల్లోతెర‌కెక్కించారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. అయితే ర‌షెస్ చూసుకున్న త‌ర్వాత కొన్ని సీన్లు రీ షూట్ చేస్తే బావుంటుంద‌ని అనిపించింద‌ట‌. సో ఆ కొన్ని సీన్ల‌ను రీ షూట్ చేస్తున్నార‌ట‌. ప్యాచ్ వ‌ర్క్ అని యూనిట్‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

సో 'ల‌వ‌ర్‌', 'శ్రీనివాస క‌ల్యాణం' పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో తాజా సినిమాను అన్ని విధాలా జాగ్ర‌త్త‌గా చూసుకుని విడుద‌ల చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నారు దిల్ రాజు. అందులో భాగంగానే రీ షూట్లు చేయిస్తున్నార‌ని అనుకోవ‌చ్చు. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకు శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మాత‌లు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz