close
Choose your channels

‘లూసిఫర్’ రీమేక్‌లో మార్పులు ఇవేనట..

Friday, February 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘లూసిఫర్’ రీమేక్‌లో మార్పులు ఇవేనట..

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లూసిఫర్‌ను తెలుగులో మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌ను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్‌వీఆర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా `లూసిఫర్` కథకు దర్శకుడు కొన్ని మార్పులు చేస్తున్నారట. `లూసిఫర్`లో మోహన్ లాల్ పాత్ర మొదట్నుంచి చివరి వరకు చాలా సీరియస్‌గా ఉంటుంది. పంచెక్టులో మోహన్‌లాల్ చాలా హూందాగా కనిపిస్తారు. అలాగే సినిమాలో హీరోయిన్ ఉండదు. పాటలు కూడా ఉండవు. అయితే తెలుగు ప్రేక్షకులు వీటిని అంగీకరించడం కాస్త కష్టమే. కాబట్టి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మారుస్తున్నారట. చిరంజీవి పాత్రకు కాస్త హ్యూమర్‌ను జోడిస్తున్నారట.

అలాగే తెలుగు రీమేక్‌లో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్. చిరంజీవి నుంచి మాస్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలనూ ఈ చిత్రంలో జోడిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, ఈ మార్పు చేర్పులు సినిమాకు ప్లస్ అవుతాయో, మైనస్ అవుతాయో చూడాలి. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారని సమాచారం. లాక్‌డౌన్ సమయంలో తన నటన ద్వారా మంచి నేమ్, ఫేమ్‌ను సత్యదేవ్ సంపాదించుకున్నారు. చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఇది ఆయన కెరీర్‌కే తిరుగులేని టర్నింగ్ పాయింట్ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.