close
Choose your channels

బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే ఇలా చేయండి..

Monday, May 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే ఇలా చేయండి..

దేశాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు ఇది ఎక్కువగా సోకుంతోంది. దీంతో కరోనా బారిన పడి కోలుకున్నవారిని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయం వెంటాడుతోంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారు గంటల వ్యవధిలోనే మరణిస్తుండటంతో మరింత భయాందోళనకు ప్రజలు గురవుతున్నారు. మోల్డులు గుంపులుగా ఉండి వ్యాధిని వ్యాపింపజేయడమే మ్యూకర్ మైసైట్స్. అయితే ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు కానీ ఇప్పుడు దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో పాటు ప్రాణాలు సైతం పోతుండటంతో దీని గురించి చర్చ మొదలైంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ కొన్ని సూచనలు చేశారు.

బ్లాక్ ఫంగస్ - కేంద్రం సూచనలు:

బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే అంటే ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి సోకుతుంది.
బ్లాక్ ఫంగస్ అనేది శరీరంలోకి ప్రవేశిస్తే... ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి మరింత పతనమవుతుంది.
దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది.
వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ఐసీయూలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకే అవకాశం చాలా ఎక్కువ.

బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటంటే..

కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి.

నాలికపై నల్లటి మచ్చలు ఏర్పడినా కూడా దానిని బ్లాక్ ఫంగస్‌గానే భావించి పరీక్షలు చేయించుకోవాలి.

ముక్కు చుట్టూ చర్మంపై నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి.

అయితే సంతోషించదగిన విషయం ఏంటంటే.. ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే... ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.

బ్లాక్ ఫంగస్ సోకితే... 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్... ఎముకలను కూడా తినేస్తుంది. సోకిన కొన్ని గంటల్లో బ్రెయిన్‌కు ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా రోగి చనిపోతాడు. అయితే దీనిని గుర్తించి వెంటనే ట్రీట్‌మెంట్ అందిస్తే... రోగిని బతికించే అవకాశం ఉంటుంది. దీనికోసం కేంద్రం ‘యాంఫోటెరిసిన్ బి’ అనే మందును ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మందు వాడితే బ్లాక్ ఫంగస్ నుంచి విముక్తి లభిస్తుంది.

బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే..

డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటిస్ ఉన్నవారు... డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

స్టెరాయిడ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వాడాలి.

కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే... అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.

పైన తెలిపిన బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో ఏది ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

వెంటనే ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.

నరానికి వేసే యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒక డోసుకు రూ.3500 అవుతుంది. ఈ ఇంజెక్షన్‌ను ఎనిమిది వారాలపాటు రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి ఈ ఇంజక్షన్ మాత్రమే సమర్థంగా కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు.

కొవిడ్ సోకిన రోగులు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, తమను తాము కాపాడుకోవాలంటే ఒకే ఒక అవకాశం ఉందని... చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత స్టెరాయిడ్స్ సరైన డోసులో, తగిన వ్యవధిలో వేసుకునేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.