ప్రేమ వ్య‌వ‌హారంపై నోరు విప్పిన హీరో.. మ‌తం కూడా మార్చుకున్నాడు

  • IndiaGlitz, [Monday,December 23 2019]

హీరో జై.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిసిన పేరే. గ‌తంలో ఆయ‌న న‌టించిన త‌మిళ చిత్రం 'జ‌ర్నీ' పేరుతో విడుద‌లై పెద్ద స‌క్సెస్ అయ్యింది. అక్క‌డితో ఆగిపోలేదీ హీరో, తెలుగు హీరోయిన్ అంజ‌లితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉండ‌గానే బెలూన్ సినిమాలో న‌టించారు. వీరిద్ద‌రూ ఘాటు ప్రేమాయ‌ణం న‌డిపారు. ఎంత‌లా అంటే.. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు అనేంతగా ప్రేమించుకున్న వీరిద్ద‌రూ విడిపోయారు. ఈ ప్రేమ వ్య‌వ‌హారంపై స్పందించిన ఈ హీరో తాను, అంజ‌లి మంచి స్నేహితుల‌మే. కానీ ప్రేమికులం కాదని చెప్పాడు.

తాను త్వ‌రలోనే మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాన‌ని, త‌న పెళ్లి త్వ‌ర‌లోనే ఏదో ఒక‌టి చెబుతాన‌ని హీరో జై తెలిపాడు. అంతే కాకుండా.. ఈ హీరో ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై కూడా జై స్పందించాడు. ఏడేళ్లుగా ఇస్లాం మ‌తాన్ని పాటిస్తున్నాన‌ని, దేవుడిని న‌మ్మ‌ని తాను ఏదో ఒక దేవుడిని న‌మ్మితే చాలున‌ని భావించిన త‌న కుటుంబం ఈ వ్య‌వ‌హారంపై అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని హీరో చెప్పాడు. త్వ‌ర‌లోనే త‌న పేరుని అశిష్ జైగా మార్చుకుంటున్నాన‌ని తెలిపాడు హీరో జై.

More News

ప‌రుశురామ్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌

ఓ సినిమా పెద్ద హిట్ట‌యితే ఆ ద‌ర్శ‌కుడికి వ‌చ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి నిర్మాత‌లు అడ్వాన్సులు ఇచ్చి త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేయాలంటూ లాక్ చేసుకుంటారు.

చెప్ప‌క‌నే చెప్పేసిన ద‌ర్శ‌క‌ధీరుడు

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో

పౌరసత్వ బిల్లు: మరణం వస్తే మీకంటే ముందు నేనే..!

భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ పిలుపునిచ్చారు.

ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా

అంగరంగ వైభవంగా వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బుల్లి తెర అవార్డ్స్ ప్రధానోత్సవం

వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.