Dhanush Son Yatra: అచ్చు గుద్దినట్లు హీరో ధనుష్‌ను దించేసిన పెద్ద కొడుకు 'యాత్ర'

  • IndiaGlitz, [Saturday,January 27 2024]

తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. తెలుగులో '3', 'రఘువరన్ బీటెక్' వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ తెలుగు మూవీ 'సార్'తోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హిందీలోనూ కొన్ని సినిమాలు చేసి అక్కడా పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా 'కెప్టెన్ మిల్లర్‌'తో తమిళ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా తెలుగులోనూ విడుదలైంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం కిందట వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరి పేరు 'యాత్ర', మరికొరి పేరు 'లింగ'. కానీ కుమారుల బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటున్నారు. గతంలో ఓ ఫంక్షన్‌లో ధనుష్‌తో ఉన్న వీరిద్దరు ఉన్న ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

తాజాగా ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలాం' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో శుక్రవారం రాత్రి గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇందులో ధనుష్ ఇద్దరు కొడుకులు అమ్మ ఐశ్వర్యతో కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద కొడుకు 'యాత్ర' అచ్చు గుద్దినట్లు ధనుష్‌ లాగే ఉండటం విశేషం. దీంతో ధనుష్‌ వారసుడు త్వరలోనే సినిమాల్లోకి రావడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే భారత్‌లో ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌ను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'లాల్ సలామ్‌’ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ న‌టించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

More News

Chiru-Venkaiah Naidu: 'పద్మవిభూషణుల' కలయిక.. ఒకరిపై ఒకరు ప్రశంసలు.. 

తెలుగు ప్రజలకు గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిశారు.  ఒకే రాష్ట్రానికి చెందిన తెలుగు తేజాలకు ఒకేరోజు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించండం చాలా అరుదు.

CM Jagan:ఎన్నికల యుద్ధానికి వైసీపీ 'సిద్ధం'.. క్యాడర్‌ను 'సంసిద్ధం' చేయనున్న జగన్..

ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఫిబ్రవరిలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ ట్వీట్ వైరల్.. ఏమన్నారంటే..?

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకంలో బద్దెన రాసిన 'కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన

రిపబ్లిక్ డే నాకు ఎంతో ప్రత్యేకం.. పద్మవిభూషణ్‌ వస్తుందని ఊహించలేదు: చిరు

దేశంలో రాజ్యాంగం అమలైన గణంతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రిపబ్లిక్ డే రోజునే తనకు దేశంలోనే రెండు అత్యుతమైన అవార్డులు వచ్చాయన్నారు.

చంద్రబాబుపై పవన్ వ్యాఖ్యల మర్మం ఏంటి..? టీడీపీకి బైబై చెబుతారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట, అరుకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.