సూర్య‌కు డ‌బ్బింగ్ చెబుతున్న హీరో

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది. కాగా త్వరలోనే సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులను స్టార్ట్ చేస్తున్నారు. కాగా తాజా స‌మాచారం మేర‌కు ఈసారి తెలుగులో సూర్య వాయిస్‌కు తెలుగులో ఓ హీరో డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నాడ‌ని టాక్‌. విన‌ప‌డుతుంది. ఆ హీరో ఎవ‌రో కాదు స‌త్య‌దేవ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీనివాస‌మూర్తి డ‌బ్బింగ్ చెప్పాడు. అయితే సూర్య ‘గ్యాంగ్‌’కు సూర్య‌నే డ‌బ్బింగ్ చెప్పుకున్నాడు. కాగా..ఇప్పుడు స‌త్య‌దేవ్‌తో డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని చూస్తున్నాడు.

త్వరలోనే ఆకాశం నీహ‌ద్దురా సినిమా విడుద‌ల తేదీపై సూర్య అండ్ టీమ్ ఓ క్లారిటీని ఇవ్వ‌నున్నారు. అలాగే సూర్య డైరెక్ట‌ర్ హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో అరువా అనే సినిమాను చేయ‌బోతున్నారు. అలాగే వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ సూర్య మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

More News

పైర‌సీపై కొత్త చ‌ట్టం రాబోతుందా?

సినిమా ఇండ‌స్ట్రీని చాలా సంవ‌త్స‌రాలుగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో పైర‌సీ స‌మ‌స్య ఒక‌టి. ఎంత పెద్ద సినిమా అయినా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే పైర‌సీకి గుర‌వుతుంది.

డిఫరెంట్ కోణంలో ఆది సాయికుమార్ 'బ్లాక్'

మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే మాస్‌క‌మ‌ర్షియ‌ల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రం తో ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ ని హీరోయిన్ గా,

టాలీవుడ్‌లో మరో విషాదం.. మిమిక్రీ హరికిషన్ కన్నుమూత

టాలీవుడ్‌ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇవాళ ఉదయం సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ మరణించారనే వార్త విని 24 గంటలు పూర్తి కాకమునుపే మరో విషాద వార్త వినాల్సి వచ్చింది.

ఈసారి నాని తెలంగాణ‌పై మ‌న‌సుప‌డ్డాడు!!

హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఏంటి?  తెలంగాణపై మ‌న‌సుప‌డ్డ‌మేంటి? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.

రెట్రో లుక్‌లో రెజీనా!!

ఎస్‌.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన చెన్నై సొగ‌స‌రి రెజీనా క‌సండ్ర కొత్త ట‌ర్న్ తీసుకున్నారు. హీరోయిన్‌గానే కాదు..