హీరో ఫిక్సయ్యాడా..?

  • IndiaGlitz, [Saturday,July 15 2017]

బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటాడు దర్శ‌కుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి రెండు పార్టులు క‌లిపి దాదాపు రెండు వేల ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేయ‌డం విశేషం. ఇప్పుడు అంద‌రూ తెలుగు సినిమా రంగం వైపు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రో వైపు బాహుబ‌లి వంటి విజువ‌ల్ వండ‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజ‌మౌళి ఎన్టీఆర్‌తో చేస్తాడ‌ని ఈ మధ్య వార్త‌లు వినప‌డ్డాయి కూడా. కాగా తాజాగా ఇప్పుడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ముగ్గురు హీరోల‌తో చేస్తాడ‌నే టాలీవుడ్ టాక్‌. ఈ సినిమాను ముఖ్యంగా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాషల్లో తెర‌కెక్కిస్తార‌ట‌. ఒక్కొక్క భాష నుండి ఒక్కో హీరో న‌టించే అవ‌కాశాలున్నాయంటున్నారు. తాజా సమాచారం ప్ర‌కారం రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రంలో జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ న‌టిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే మోహ‌న్‌లాల్ మ‌న‌మంతా, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో ఇంకా సుప‌రిచితులైయ్యారు. దీంతో రాజ‌మౌళి క‌న్ను మోహ‌న్‌లాల్‌పై ప‌డింది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే రాజ‌మౌళి సినిమాపై ఓ క్లారిటీ రానుంది.

More News

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ ఎంటర్ టైనర్ 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' - ప్రవీణ్ సత్తారు

అంకుశం,అగ్రహం,మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెర పై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో

'రా.రా...' లో మరో గీతం 'గల్లాటే గల్లాటే' విడుదల

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలోనే విడుదల కాబోతోంది.

ప్రేమిక ను చిన్న మూవీగా చూడకండి...

తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన మూవీ ప్రేమిక. ఈ మూవీని దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాటలు, దర్శకత్వం మహేంద్ర. ఈ సినిమా టీజర్ ను ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.

నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సంబరాలు

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్రతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్

జూలై 16న విజయవాడలో 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం 'నిన్నుకోరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్తో సూపర్హిట్ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.