close
Choose your channels

హీరో గోపిచంద్‌‌కు రోడ్డు ప్రమాదం

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో గోపిచంద్‌‌కు రోడ్డు ప్రమాదం

హీరో గోపిచంద్ మరోసారి షూటింగ్‌‌లో గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ (రాజస్థాన్) దగ్గర మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. రోజుమాదిరిగానే సోమవారం నాడు షూటింగ్‌‌ జరిగింది.. ఇవాళ హీరో గోపీచంద్‌‌పై ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో బైక్‌‌ పై నుంచి హీరో కిందపడ్డారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయన్ను స్థానికంగా ఉన్న ఫోర్టీస్ ఆస్పత్రికి తరలించిన చిత్రబృందం.. వైద్యం అందిస్తోంది. కాగా చిన్నగాయాలు మినహా గోపిచంద్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. చికిత్స అనంతరం కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కాగా ఇప్పటి వరకూ చాలా సార్లు ఇలాగే షూటింగ్‌‌‌లో గోపిచంద్ గాయపడ్డారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ప్రతీసారి ఇలా జరుగుతుండటం దురదుష్టకరం. గతంలో ఆయన నటించిన ‘పంతం’ సినిమా షూటింగ్ సమయంలో కూడా గాయపడ్డారు. మొదట ఆ గాయం చిన్నదే అని భావించినప్పటికీ ఈ మ‌ధ్యే కుడి భుజానికి స‌ర్జరీ చేయించుకున్నారు. సుమారు ఏడునెలలు విశ్రాంతి అనంతరం సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయ‌న ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.