close
Choose your channels

ఐశ్వర్యను ఘోరంగా అవమానించిన హీరో!

Monday, May 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐశ్వర్యను ఘోరంగా అవమానించిన హీరో!

సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం.. వారిని ఆటపట్టించడం లాంటి చిల్లర పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలానే మనం చూసుంటాం. నటులు, నటీమణులు కూడా ఈ నెటిజన్లకు దొరికిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయ్!.

అయితే తోటి సెలబ్రిటీలే.. నటిని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది.? ఎంత అసహ్యంగా ఉంటుందో అర్థం చేసుకోండి. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. తన మాజీ ప్రియురాలు, బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యరాయ్‌ను ఘోరంగా అవమానిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

దుమ్మెత్తిపోస్తున్నారు..!

నెటిజన్లు, ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ అభిమానులు, బిగ్ బి ఫ్యాన్స్‌.. అంతేకాదు తన సొంత ఫ్యాన్సే ఒబేరాయ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా.. గతంలో ఐశ్వర్యరాయ్.. సల్లు భాయ్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అభిషేక్‌ని పెళ్లి చేసుకొని కూతుర్ని కని ప్రస్తుతం జీవితం హాయిగా గడిపేస్తున్నది. అయితే అప్పుడప్పుడు ఇలా వివేక్ లాంటి వాళ్లు పాత జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూ మనసు నొప్పిస్తూనే ఉన్నారు.

అసలేంటి ఈ వ్యవహారం!

కాగా.. ఈ డేటింగ్, పెళ్లి వ్యవహారాలను ఎగ్జిట్ పోల్స్‌కు అనుకరిస్తూ ఓ ఇమేజ్ తయారు చేశారు. ఇందులో ఐశ్వర్య- సల్మాన్‌ల ఒపీనియన్ పోల్ అని.. ఐశ్వర్య-వివేక్‌ ఎగ్జిట్ పోల్ అని.. ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ ఫలితాలు అని రాయడం గమనార్హం. ఈ ఫొటోను పోస్ట్ చేయడమే పెద్ద తప్పయితే దానికి మళ్లీ ‘క్రియేటివ్! నో రాజకీయాలు.. కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టడం సిగ్గుచేటు.!.

అసలు బాలీవుడ్‌లో వివాదం రేగితే అది ఫుల్‌స్టాప్ పడటం కష్టమే.. అలాంటిది వివేక్ ఇప్పుడు ఎవరో షేర్ చేసిన ఫొటోతో ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారాలన్నింటికీ అగ్గి రాజేశాడు.. ఈ ట్వీట్‌పై సల్లు భాయ్, ఐశ్వర్యారయ్, బిగ్ బీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

ఇదిలా ఉంటే.. వివేక్ ఒబెరాయ్ ఈ మ‌ధ్య సినిమాల కంటే రాజ‌కీయాల్లో చాలా చురుకుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి ఆయ‌న ప్రత్యక్షంగా త‌న మ‌ద్దతివ్వడమే కాకుండా.. మోదీ పనితీరు నచ్చి న‌రేంద్రమోదీ బ‌యోపిక్‌లో కూడా ‘మోదీ’గా న‌టించిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.