ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో..

  • IndiaGlitz, [Friday,July 08 2016]

హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో ఎవ‌రునుకుంటున్నారా..? లాహిరి లాహిరి లాహిరిలో..., ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం. తాజాగా మోడ్రన్‌ సినిమా బ్యానర్‌పై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.విజ‌య్ వ‌ర్మ పాక‌ల‌పాటి నిర్మాణ భాగ‌స్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.సోష‌ల్ మీడియా బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే...ఈ చిత్రానికి నైజాంలో 30 థియేట‌ర్స్ ఇస్తామ‌ని చెప్పిన డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈరోజు మాట మార్చి కేవ‌లం 3 థియేట‌ర్స్ మాత్ర‌మే ఇస్తామ‌న్నార‌ట‌. దీంతో మాకు న్యాయం చేయాలంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి...ఈ వివాదం పై సినీ పెద్ద‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

నిఖిల్ మూవీతో క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తున్న ఆది..

డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు.

ఫ‌స్ట్‌డే 1.26 కొట్ల గ్రాస్ వసూలుచేసిన‌ రష్మి గౌత‌మ్‌ 'అంతం'

'గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.

సురేష్ బాబు చేతుల మీదుగా పెళ్ళి చూపులు ఆడియో విడుదల

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెళ్లి చూపులు. ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూత్న‌ గీత బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్ రాగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గోవుల మ‌ధ్య గోపాలుడు...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్ర‌కృతి అన్నా, ప‌శువులు అన్నా ఎంతో ఇష్టం. అందుకే స‌మ‌యం దొరికితే చాలు...త‌న ఫామ్ హౌస్ లో ప్ర‌కృతి, ప‌శువుల మ‌ధ్య ఎక్కువ గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాడు.

ఆ డైరెక్ట‌ర్ న‌న్ను మోసం చేసాడంటున్న రేష్మి..

గుంటూరు టాకీస్ చిత్రంలో త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్న రేష్మి తాజా చిత్రం అంతం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ తెర‌కెక్కించారు.