హీరో సుశాంత్ కు పితృ వియోగం

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెల‌కొంది. అక్కినేని నాగార్జున మేనల్లుడు అయిన సుశాంత్ తండ్రి అనుమోలు స‌త్య భూష‌ణ‌రావు(68) అనారోగ్యంతో క‌న్నుమూశారు. నాగార్జున సోద‌రి ఎ.నాగసుశీల భ‌ర్త అయిన అనుమోలు స‌త్య‌నారాయ‌ణ రెండేళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. గురువారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యం తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు సుశాంత్ తండ్రి మృతికి సంతాపం తెలియ‌జేశారు.