దర్శకుడిగా మారుతున్న హీరో..

  • IndiaGlitz, [Sunday,September 03 2017]

హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ త్వ‌రలోనే మెగాఫోన్ ప‌ట్ట‌నున్నారు. అవును నిజ‌మే..ఈ విష‌యాన్ని రాహుల్ ర‌వీంద్ర‌న్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఇంత‌కు రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట్ చేయ‌నున్న హీరో ఎవ‌రో కాదు, అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుశాంత్‌. త‌న‌కు క‌థ బాగా న‌చ్చింద‌ని, స్వేచ్ఛ‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని సుశాంత్ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతార‌ని కూడా తెలిపారు. రాహుల్ ర‌వీంద్ర‌న్‌కు ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక ఉండేద‌ట‌. అయితే అందాల రాక్ష‌సితో హీరోగా మారాడు. ఎలాగైతేనేం త‌న చిన్న‌నాటి కోరిక నేర‌వేరుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని రాహుల్ తన సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.