Vijay Antony : నేను బాగానే వున్నా.. హాస్పిటల్ బెడ్‌పై నుంచే విజయ్ ఆంటోనీ ట్వీట్

  • IndiaGlitz, [Wednesday,January 25 2023]

బిచ్చగాడుతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా వుందని, ఐసీయూలో చికిత్స జరుగుతోందని పుకార్లు హల్ చల్ చేశాయి. దీనిపై స్వయంగా విజయ్ సతీమణి క్లారిటీ ఇచ్చినా ఈ గాసిప్స్‌కి తెరపడలేదు. దీంతో స్వయంగా విజయ్ ఆంటోనీ స్పందించారు.

అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ :

‘‘ మలేషియాలో బిచ్చగాడు 2 షూటింగ్ చేస్తుండగా.. జరిగిన ప్రమాదంలో తన దవడ, ముక్కు భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను.తనకు కీలకమైన సర్జరీ పూర్తయ్యింది. వీలైనంత త్వరలో మీ అందరితో మాట్లాడతా.. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ ’’ అంటూ విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. అలాగే చివరిలో థంప్సప్ సింబల్‌ను చూపించారు. దీంతో విజయ్ ఆంటోనీ అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.

సిబ్బంది బోటును ఢీకొట్టిన విజయ్ పడవ:

ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. విజయ్ ప్రయాణిస్తున్న బోట్ పక్కనే వున్న క్రూ సిబ్బంది పడవని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత విజయ్‌ని మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చినట్లుగా కోలీవుడ్ మీడియా తెలిపింది. ఇకపోతే.. బిచ్చగాడు 2ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. బిచ్చగాడుకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై దక్షిణాదిలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు.

More News

Pawan Kalyan : ఇకపై తెలంగాణపైనా ఫోకస్.. 10 మంది జనసేన ఎమ్మెల్యేలు వుండాల్సిందే : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమవుతారా .. లేదంటే తెలంగాణలోనూ ఎంట్రీ ఇస్తారా అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు.

SVRangarao: ఎస్వీ రంగారావుపై వ్యాఖ్యలు : భగ్గుమన్న కాపునాడు, క్షమాపణలు చెప్పకుంటే .. బాలయ్యకు అల్టీమేటం

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కాపు నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Akhil and Naga Chaitanya:అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యలు : బాలయ్యకు కౌంటరిచ్చిన అఖిల్, చైతూ.. నాగార్జునే బ్యాలెన్స్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

Oscar Nominations 2023 : ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘‘ఆర్ఆర్ఆర్’’.. నాటు నాటుకు నామినేషన్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచింది.

Karthika Deepam : తెలుగు సీరియల్ సత్తా చాటి, టీఆర్పీల మోత మోగించిన కార్తీక దీపానికి ఎండ్ కార్డ్

కార్తీక దీపం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ముఖ్యంగా మహిళలు వుండరు.