పోర్న్ వీడియో రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌...!

  • IndiaGlitz, [Monday,February 08 2021]

హిందీ, తెలుగు చిత్రాల్లో న‌టించిన న‌టి, మోడ‌ల్ గెహ‌నా వ‌శిష్ట్‌ను ముంబై పోలీసులు పోర్న్ కేసులో అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో పోర్న్ వీడియోల చిత్రీక‌ర‌ణ‌, అప్‌లోడింగ్ త‌దిత‌ర విష‌యాల్లో గెహ‌నా వ‌శిష్ట్ ప్ర‌మేయం ఉంద‌ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు 87 వీడియోల‌ను గెహ‌నా త‌న సంబంధిత వెబ్‌సైట్స్‌లో ఉంచిన‌ట్లు స‌మాచారం. పోర్న్ వీడియోల‌ను ముంబై మ‌ల‌ద్‌లోని ఓ బంగ్లాలో చిత్రీక‌రిస్తున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో పోలీసులు రైడ్ చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మ‌హిళా ఫోటోగ్రాఫ‌ర్‌, గ్రాఫిక్ డిజైన‌ర్‌, ఇద్ద‌రు న‌టులు, లైట్ మ్యాన్ ఉన్నారు. వీరి నుంచి ల్యాప్ టాప్, కెమెరా, ఆరు మొబైల్ ఫోన్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈమెకు బెయిల్ దొరికే అవకాశం ఉంది.

ఫిల్మ్ దునియా సినిమాతో న‌టిగా బాలీవుడ్‌లో త‌న కెరీర్‌నుస్టార్ట్ చేసిన గెహ‌నా వ‌శిష్ట్‌.. తెలుగులోనూ సినిమాలు చేసింది. ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. అలాగే, ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న 2, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్‌స్టోరి, అనుకున్న‌దొక్క‌టి అయిన‌ది ఒక్క‌టి, 33 ప్రేమ క‌థ‌లు వంటి సినిమాల్లో న‌టించింది.

More News

ఏపీ హైకోర్టులో ఎస్ఈసీకి చుక్కెదురు.. పెద్దిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చుక్కెదురైంది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.

పవర్‌స్టార్‌ దగ్గర పని చేశాడు... మాస్‌ మహారాజా దగ్గరకొచ్చాడు!

మాస్‌ మహారాజా రవితేజ ప్రజెంట్‌ ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

‘ఆదిపురుష్‌’ను ‘రాధేశ్యామ్‌’ ఫాలో అవుతున్నాడా?

ప్రభాస్‌ రూటు మార్చాడు. అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అవన్నీ స్వీట్‌ షాకులే అనుకోండి.

ఫిబ్రవరి నెలాఖరున సత్తారు సెట్‌కి కింగ్‌

‘గరుడవేగ’ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్‌ సత్తారు సత్తా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసింది. సెన్సిబుల్‌ సినిమా ‘చందమామ కథలు’ తీసిన వ్యక్తిలో ఇంత విషయం ఉందా?

ఎడారిలో మహేష్‌ కుమార్తె సితార

ఎడారిలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార ఎంజాయ్‌ చేసింది. ఒంటెలు, బైకులు, డన్‌ బగ్గీస్‌లో షికార్లు చేసింది.