స్టార్ హీరోకి ఫిదా అయిన హీరోయిన్‌...

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

అమీ తుమీ, అ! చిత్రాల్లో న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న న‌టి 'ఈషా రెబ్బా'. ఇప్పుడు 'అర‌వింద స‌మేత‌...' చిత్రంలో ఎన్టీఆర్ జ‌త‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో విల‌క్ష‌ణ‌మైన అట్యిట్యూడ్ ఉన్న వ్య‌క్తిగా ఈషా క‌నిపించ‌నుంది.

ఇలాంటి పాత్ర‌ను త‌న‌కు ఇచ్చిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్ చెబుతుంది ఈషా. అంతే కాకుండా సెట్‌లో ఎన్టీఆర్ ఎన‌ర్జి లెవ‌ల్స్ అద్భుత‌మని.. త‌న ఎన‌ర్జినీ క్యాచ్ చేయ‌డం అంత సులువు కాద‌ని కూడా అంటుంది.

పొగ‌డ్త‌ల‌తో యంగ్ టైగ‌ర్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది ఈషా రెబ్బా. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.