రానాకి షాకిచ్చిన హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,September 18 2019]

రానా ద‌గ్గుబాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో రానా హీరోగా రూపొందుతూ ఆగిపోయిన సినిమాల‌ను పూర్తి చేయ‌బోతున్నాడు. అలాగే మ‌రిన్ని కొత్త సినిమాల‌ను రూపొందించ‌డానికి రెడీ అవుతున్నాడు. అందులో నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

వివ‌రాల ప్ర‌కారం రీసెంట్‌గా కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో 'ఓబేబీ'గా రీమేక్ చేసి హిట్ సాధించిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి. ఈమె త‌దుప‌రి సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే ఓ ద్విభాషా చిత్రం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రానా హీరోగా న‌టిస్తున్నాడు. కాగా.. ఇందులో రానా స‌ర‌స‌న కీర్తి సురేశ్‌ను న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి ఆమెను సంప్ర‌దించార‌ట‌. అయితే కీర్తి సురేశ్ డేట్స్ ఖాళీగా లేవ‌ని సింపుల్‌గా సారీ చెప్పేసింద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

'మ‌హాన‌టి'తో కీర్తి సురేశ్ స్టార్‌హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా త‌ర్వాత కీర్తి సినిమాల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు వ‌హిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఆప్ష‌న్‌గా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కీర్తి క‌న‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈమె మిస్ ఇండియా సినిమాలో న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్‌లోనూ అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో క‌లిసి 'మైదాన్‌'సినిమాలో న‌టిస్తుంది. ఇలా చేతినిండా ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేశ్‌.

More News

షాకింగ్ ధరకు సైరా శాటిలైట్ హక్కులు

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం సైరా న‌రసింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న తెలుగు

శ్రీ‌కాంత్ చేతుల మీదుగా 'డ‌స్ట‌ర్‌1212' ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

శుభ‌కరి క్రియేష‌న్స్ ప‌తాకం పై వాల్మికీ ఫేమ్ అథ‌ర్వా హీరోగా న‌టించిన చిత్రం డ‌స్ట‌ర్‌1212. బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి మ‌రిపి విద్యాసాగ‌ర్ (విన‌య్‌) నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు: పుష‌ప్‌... న‌డ‌క‌... టెన్ టైమ్స్!

ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌ది సార్లు న‌డ‌క‌, ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌ది సార్లు న‌డ‌క‌, ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌దిసార్లు న‌డ‌క‌... ఇదంతా ఒక్క సెట్టు. ఇలాంటివి ప‌ది రౌండ్లు చేస్తే ఏదో ఎక్స‌ర్‌సైజ్

అవునా కాజ‌ల్‌... నిజంగా నిజ‌మేనా?

ఇప్పుడు కాజ‌ల్‌ని చూసిన వాళ్లు చాలా మంది వింత‌గా అచ్చం ఇలానే అడుగుతున్నారు. అవునా కాజ‌ల్‌.. నిజంగా నిజ‌మేనా? అని. ఎందుకంటే ఆమె తాజ్‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం చూసి

'దేవత' సినిమాలాగే 'వాల్మీకి' కూడా 25 వారాలు ఆడాలి: కె. రాఘవేంద్రరావు

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే