close
Choose your channels

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

Thursday, November 26, 2020 • తెలుగు Comments

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు. సినిమాల్లో ఓ సినిమా సునీల్‌కు భారీ హిట్ అంటే మ‌ర్యాద‌రామ‌న్య అనే చెబుతారు ఎవ‌రైనా. ఈ సినిమాలో సునీల్ స‌ర‌స‌న జోడీ క‌ట్టిన హీరోయిన్ స‌లోని. ఈమెకు త‌ర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వ‌లేదు. కాగా.. ప‌దేళ్ల త‌ర్వాత మ‌రోసారి సునీల్‌, స‌లోని జంట‌గా నటించ‌బోతున్నార‌ని స‌మాచారం.

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా ఓ సినిమా రూపొంద‌నుంది. మినిమం బ‌డ్జెట్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఓటీటీలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారట‌. దర్శకుడిగా మనసంతా నువ్వే వంటి హిట్ కొట్టిన వి.ఎన్.ఆదిత్య దర్శకుడిగా మాత్రం సినిమాను డైరెక్ట్ చేసి చాలా కాలమే అయ్యింది. ఈయన దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Get Breaking News Alerts From IndiaGlitz