బాల‌య్య మూవీలో న‌టించ‌డం లేదంటున్న హీరోయిన్

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌ 99వ సినిమా డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా రిలీజై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక బాల‌య్య 100వ సినిమాను త్వ‌ర‌లో గ్రాండ్ గా ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బాల‌య్య 100వ సినిమాకి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కుడ‌ని...ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు బాల‌య్య ప్ర‌క‌టించారు.

అయితే ఈ క్రేజీ మూవీలో బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్ తాప్సీ న‌టిస్తున్నట్టు ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యం గురించి హీరోయిన్ తాప్సీని అడిగితే అలాంటిదేమీ లేదంటుంది. ఇటీవ‌ల‌ సి.సి.ఎల్ మ్యాచ్ కు తాప్సీ వ‌చ్చిన‌ప్పుడు ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగితే.... అస‌లు ఇలాంటి రూమ‌ర్స్ ఎలా వ‌స్తాయో తెలియ‌డం లేదంటుంది. మ‌రి..ఈ క్రేజీ మూవీలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

'నాయకి' రిలీజింగ్

ముప్పై ఏళ్ళ వ‌య‌సు వ‌చ్చిన సోయ‌గం త‌గ్గ‌ని ఈ సొగ‌స‌రి ఇప్పుడు గోవి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో మామిడిప‌ల్లి గిరిధ‌ర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం ‘నాయ‌కి’లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాజ్ త‌రుణ్ సినిమా లైన్ ఇదేన‌ట‌

ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో హ్య‌ట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్‌త‌రుణ్ ఇప్పుడు సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు సినిమాతో త్వ‌ర‌లోనే మన ముందుకు రానున్నాడు.

వివాదంలో..చిరు 150వ సినిమా

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గ‌త కొన్నిసంవ‌త్స‌రాలుగా అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎంత‌గానో ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో సాయిరామ్ శంకర్ - విభా ఎంటర్ టైన్మెంట్ చిత్రం

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో ఎవ‌రో కాదు...క‌మ‌ల్ హాస‌న్. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్.