కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు
- IndiaGlitz, [Thursday,July 21 2016]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. రేపు ప్రపంచ వ్యాప్తంగా కబాలి రిలీజ్ అనగా శుక్ర ఫిలిమ్స్ సంస్థ భాగస్వామి ఆర్.మహాప్రభు కబాలి రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్ వేసారు. దీనికి కారణం ఏమిటంటే... లింగా డిజాస్టర్ అవ్వడంతో నిర్మాత వెంకటేష్, హీరో రజనీకాంత్ నష్టపోయిన మొత్తం ఆర్.మహాప్రభుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా 89 లక్షలు ఇవ్వాలి. ఆ బాకీ తీర్చే దాకా కబాలి రిలీజ్ ఆపాలంటూ పిటిషన్ వేసారు. అయితే...ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు ఒక రోజు గడువు ముందు చిత్రం విడుదల పై స్టే విధించలేం. లింగా చిత్రం వివాదాన్ని ఈ చిత్రంతో చూడలేం. లింగా ఆర్ధిక లావాదేవీల అంశం పరిశీలిస్తాం అని పేర్కొంటూ కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చేసింది.