డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై హైకోర్టులో విచారణ

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

డిగ్రీ, పీజీ పరీక్షల రద్దు చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని.. రద్దు చేయడం కుదరని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పరీక్షల తేదీలను సైతం రెండు, మూడు వారాల అనంతరం ఖరారు చేస్తామని ఏజీ తెలిపారు.

కాగా ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరుఫు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని దామోదర్ రెడ్డి కోర్టుకు వెల్లడించారు. ఇప్పటికే ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని తెలిపారు. అయితే మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.