ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే..

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 వరకూ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజధాని విభజన పిటిషన్లపై నేడు విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరుఫున వాదిస్తున్న శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదిస్తున్నారు. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని వారు కోర్టుకు వివరించారు. దీంతో ఏపీ గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే విధించింది. ఆగస్ట్ 14 వరకూ ఈ స్టే వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రభుత్వ తరుఫు న్యాయవాది పది రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 14కు వాయిదా వేసింది.

కాగా.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనికంటే ముందు ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని.. ఈ విభజన పూర్తయిన అనంతరమే రాజధాని పనులు చూడాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వం తమ పోరాటాన్ని పట్టించుకోదని భావించిన రైతులు ఇక న్యాయపోరాటానికి ఉపక్రమించారు. ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

More News

విశాల్‌కు వ్య‌తిరేకంగా మ‌రో నిర్మాత‌ల మండ‌లి

హీరో, నిర్మాత, ద‌ర్శకుడు విశాల్‌కు క‌రోనా క‌ష్టాలతో పాటు కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. విశాల్ హీరోగా సినిమాలు చేయ‌డ‌మే కాదు..

‘మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’కు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. ప్రస్తుతం సినిమా తుది దశ చిత్రీకరణ దశకు చేరుకుంది.

టెక్నిక‌ల్ ప‌ద్ధ‌తిలో రానా పెళ్లి..!!

టాలీవుడ్ హల్క్ హీరో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఆగ‌స్ట్ 8న పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్‌’పై నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ) రూపొందిస్తోన్న చిత్రం ‘మ‌ర్డ‌ర్‌’. మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య ఆధారంగా వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను అందిస్తాం: భారత్ బయోటెక్

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.