close
Choose your channels

ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

Monday, August 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

గత ఏడాది టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్టూడియో నిర్మాణానికి త‌క్కువ ధ‌ర‌కు భూములు ఇచ్చారు. ఈ వ్య‌వ‌హారంపై కోర్టులో కొన్ని నెల‌ల క్రితం కేసు న‌మోదైంది. ఇప్పుడు ఆ కేసుపై విచార‌ణ జ‌రిగింది. ‘రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని ఏ ప్రాతిప‌దిక‌న ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కేటాయించారు? అని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. భూ కేటాయింపులు ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రగాల‌ని పేర్కొన్నా.. ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోలేదు?’అని హైకోర్టు వేసిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఏజీ క్వారంటైన్‌లో ఉన్న కార‌ణంగా కోర్టును కాస్త స‌మ‌యం కావాల‌ని కోరు. దీంతో కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆగస్ట్ 27 తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

రంగారెడ్డి జిల్లామోకిల్లాలో ఎక‌రం ఐదు కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూమిని, ఐదు ల‌క్ష‌ల‌కు ఏ ప్రాతిప‌దిక‌న ఎన్‌.శంక‌ర్‌కు ప్ర‌భుత్వం కేటాయించారు అని హైకోర్టు ప్ర‌శ్నించింది. కోట్ల రూపాయ‌ల భూమిని త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.