close
Choose your channels

ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

Thursday, September 24, 2020 • తెలుగు Comments

ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

సినీ ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిక్ విచార‌ణ‌లో వెల్ల‌డి కావ‌డంతో అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా డ్ర‌గ్ మాఫియాతో డీలింగ్ ఉన్న‌ట్లు తెలిసిన సినీ సెల‌బ్రిటీలంద‌రినీ నార్కోటిక్ విభాగం విచార‌ణ‌కు ర‌మ్మ‌ని నోటీసుల‌ను జారీ చేసింది. ఈ కేసులో ఇప్ప‌టికే హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రాగిణి ద్వివేది, సంజ‌న‌ల‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌కి చెందిన దీపికా ప‌దుకొనె, సారా అలీఖాన్‌లతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో ఎన్‌సీబీ అధికారులు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ ర‌కుల్‌కు ఎన్‌సీబీ అధికారులు జారీ చేసిన నోటీసుల విష‌యంలో పెద్ద హైడ్రామానే న‌డుస్తుంది. అధికారులేమో నోటీసులు జారీ చేశామ‌ని చెబుతుంటే.. ర‌కుల్ స‌న్నిహితులు మాత్రం ర‌కుల్‌కి ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని చెబుతున్నారు. ఎన్‌సీబీ అధికారులు ర‌కుల్‌ప్రీత్ సింగ్‌ను కాంటాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఆమె అందుబాట‌లోకి రావ‌డం లేద‌ట‌. ముంబైకి చేరుకుంద‌ని అంటుంటే.. లేదు ఆమె హైద‌రాబాద్‌లోనే ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క్రిష్ సినిమా లొకేష‌న్‌లోనూ ర‌కుల్ లేద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz