‘జై భీమ్’ సినిమా: సూర్యకు  బెదిరింపులు.. చెన్నై పోలీసులు అప్రమత్తం

  • IndiaGlitz, [Wednesday,November 17 2021]

స్టార్ హీరో స్టేటస్‌ను పక్కనబెట్టి మరి వైవిధ్యభరితమైన చిత్రాలు, కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం జైభీమ్. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అయితే జైభీమ్‌కి కొన్ని వివాదాలు సైతం వెంటాడుతున్నాయి.

తాజాగా జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు సైతం అనేక బెదిరింపులు రావడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చెన్నై టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు భద్రతను కల్పిస్తున్నారు.

మరోవైపు ‘జై భీమ్’ విడుదలైన అన్ని భాషల్లో కలిసి ఇప్పటివరకు 40 కోట్లు రాబట్టుకుందనే వార్తలు వస్తున్నాయి. నాలుగు రేట్ల లాభం పొందటం పట్ల ఆ సంస్థ సూర్యతో మరో సినిమాను కూడా డీల్ చేసే పనిలో ఉందట..

More News

”అనుభవించు రాజా” ట్రైలర్ : నవ్వులు పండించిన రాజ్ తరుణ్, ఈసారైనా హిట్ గ్యారెంటీయేనా..?

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బిగ్‌బాస్  5 తెలుగు:  ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జెస్సీ

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్‌ జస్వంత్ అనూహ్య పరిణామాల మధ్య  హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: రక్తంతో దిష్టి... దీప్తి కావాలన్న షణ్ముఖ్, బాత్‌రూమ్‌లో తలబాదుకున్న సిరి

బిగ్‌బాస్  5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ దిశగా సాగింది.

ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ.. ప్రజల్లోకి వచ్చి వాల్ పోస్టర్స్ అంటించిన "రామ్ అసుర్" హీరో అభిన‌వ్ స‌ర్ధార్‌  హీరోయిన్ చాందిని

ఈ రోజుల్లో అన్ని హంగులతో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తవుతోంది.

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా 'శశివదనే' పూజా కార్యమ్రాలతో ప్రారంభం

'పలాస 1978' సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి.