అత్యున్నత సాంకేతికతో ప్రభాస్‌ ఆదిపురుష్‌.. ముహూర్తం ఫిక్స్‌

  • IndiaGlitz, [Tuesday,January 19 2021]

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్పీడు పెంచేశాడు. ఎంత స్పీడంటే ఇతర టాలీవుడ్‌ హీరోలే కాదు, బాలీవుడ్ స్టార్స్‌ కూడా షాక్‌ అయ్యేంత స్పీడుగా ప్రభాస్‌ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కోవిడ్‌ ప్రభావ సమయంలో స్పీడు తగ్గించిన ప్రభాస్‌.. ఇప్పుడు డబుల్‌ స్పీడుతో వెళుతున్నాడు. ప్రభాస్‌ స్పీడు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్‌ అవుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్‌ షూటింగ్‌ను ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తి చేసిన ప్రభాస్‌.. రీసెంట్‌గానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌'ను షురూ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పుడు మరో సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రభాస్‌ రెడీ అయిపోయాడు. ఆ సినిమాయే 'ఆదిపురుష్‌'. ఈ సినిమాను ఫిబ్రవరి 2న లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మంగళవారం ఈ సినిమాకు సంబంధించి మోషన్‌ క్యాప్చర్స్‌ టెక్నాలజీలో కటింగ్‌ ఎడ్జ్‌ మెథడ్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇంటర్నేషనల్‌ సినిమాల్లో ఈ టెక్నాలజీని వాడుతారు. దానికి సంబంధించిన పనులు ఈరోజు స్టార్ట్‌ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఓంరావుత్‌ అధికారికంగా ప్రకటించారు. రామాయణంను ఆదిపురుష్‌ అనే పేరుతో ఓంరావుత్‌ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న సినిమాను విడుదల చేస్తామని ముందుగానే ఓం రావుత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ ఈ ఏడాదిలోనే సలార్‌తో పాటు ఆదిపురుష్‌ సినిమాను పూర్తి చేసేస్తాడు.

More News

వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరి మృతి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కూడా వ్యాక్సిన్ అనంతర మరణాలు నమోదవుతున్నాయి.

జనసైనికుడిపై ఎమ్మెల్యే వీరంగం.. మనస్థాపంతో ఆత్మహత్య

జనసేన కార్యకర్తపై ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు విరుచుకు పడ్డారు.

‘ఇది మహాభారతం కాదు’.. టైటిల్‌లోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నా: వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం తీసినా సంచలనమే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఇప్పటి వరకూ ఆయన భయపెట్టినా..

ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్

తమ గ్రామ సమస్యలను గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు దృష్టికి తీసుకెళ్లినందుకు జనసైనికుడు వెంగయ్యనాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

త‌మ్ముడు బాట‌లో అన్న‌..!

సాధార‌ణంగా మన ఇంట్లో పెద్ద‌వారు చిన్న‌వారికి మార్గ‌ద‌ర్శకంగా నిలుస్తుంటారు. కానీ అతి కొద్ది సంద‌ర్భాల్లో మాత్ర‌మే చిన్న‌వారిని పెద్ద వారు అనుక‌రిస్తుంటారు.