‘హిర‌ణ్య’ ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి.. హీరో మారుతాడా?

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

భారీ సెట్స్ వేసి సినిమాలు చేయడంలో డైరెక్టర్ గుణశేఖర్ దిట్ట‌. ఈయ‌న తెర‌కెక్కించిన గ‌త చిత్రం రుద్ర‌మ‌దేవి. భారీ బ‌డ్జెట్‌తో మ‌రో చారిత్రాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి గుణ‌శేఖ‌ర్ సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటితో గుణ‌శేఖ‌ర్ రాక్ష‌స‌రాజు హిర‌ణ్య‌క‌శ్య‌ప‌, భ‌క్త ప్ర‌హ్లాదుడు మ‌ధ్య జ‌రిగిన క‌థ‌ను సినిమాగా తీయాల‌నుకున్నాడు. ఈ సినిమా గ్రాఫిక‌ల్ వ‌ర్క్ కోసం అంత‌ర్జాతీయం 17 స్టూడియోస్ వ‌ర్క్ చేశాయి. దాదాపు రెండేళ్లు ఈ క‌థ‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై దృష్టి పెట్టిన గుణ‌శేఖ‌ర్ వాటిని పూర్తి చేశాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ చిత్రానికి ‘హిర‌ణ్య‌’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

హీరో మారుతాడా..?

హిర‌ణ్య సినిమాను రానా ద‌గ్గుబాటితో చేయ‌డానికి సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి గుణ‌శేఖ‌ర్ వ‌ర్క్ చేశాడు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళితే బ‌డ్జెట్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయని సురేశ్‌బాబు భావిస్తున్నాడ‌ట‌. అందుక‌నే ఆయ‌న ఈ ప్రొడ‌క్ష‌న్ నుండి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో హీరో కూడా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం అవుతుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం దాదాపు ప‌ది కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం.. భారతీయులకే అధిక నష్టం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘హైర్‌ అమెరికన్‌’ నినాదంలో భాగంగా విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1-బీ, ఎల్‌1,

మ‌హేశ్‌కు శ‌ర్వా ఓకే చెబుతాడా?

నేటి త‌రం అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ మిన‌హా దాదాపు అంద‌రూ నిర్మాత‌లుగా మారిన వారే.

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

న‌న్నుదోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన హీరోయిన్ న‌భా న‌టేశ్. త‌ర్వాత మంచి అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంది.

ఇకపై మన ఆర్మీ, పోలీసులను అలా పిలవండి: పరేష్ రావెల్

సమాజంలో నిజమైన హీరోలు ఆర్మీ, పోలీసులేనని.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ తెలిపారు.

అయ్య‌ప్ప మాల వేసుకున్న అఖిల్

అక్కినేని హీరోల్లో అఖిల్ అక్కినేనిని రీసెంట్‌గా చూసిన‌వారు ఓర‌కంగా థ్రిల్ అయ్యారు.