close
Choose your channels

చరిత్ర సృష్టించిన కుర్రాడు.. 21 ఏళ్లకే న్యాయమూర్తి పదవి

Thursday, November 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎలిమెంటరీ విద్య ప్రారంభమైనప్పుడు విద్యార్థులు.. నేను కలెక్టరవుతా.. నేను ఇంజనీరవుతా.. అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే ఇలా చెబుతారో వాళ్లు దాదాపు ఆ గమ్యాన్ని చేరుకుంటారు కూడా. అయితే ఇలానే రాజస్థాన్‌కు చెందిన మయాంక్ ప్రతాప్ తాను న్యాయమూర్తి కావాలని గట్టిగా అనుకున్నాడు. అందుకు కష్టపడ్డాడు.. శ్రమకు ఫలితం దక్కింది. చివరికి చూస్తే.. 21 ఏళ్లకే న్యాయమూర్తిగా భాధ్యతలు చేపట్టి.. దేశంలో, అతి తక్కువ వయసులోనే న్యాయమూర్తిగా రికార్డ్ సృష్టించాడు. సో దీన్ని బట్టి చూస్తే ‘మనిషి అనుకుంటే కానిది ఏమున్నది’ అనే సాంగ్‌ అక్షరాలా నిజమనిపిస్తోంది మరి.

టాపర్!
పూర్తి వివరాల్లోకెళితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ప్రతాప్ ఐదేళ్ల ఎల్‌ఎల్ బీ డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమేకాక, టాపర్‌గా నిలవడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. గతంలో ఈ పరీక్షకు అర్హత వయసు 23 ఏళ్లుగా ఉండగా.. ఈ ఏడాది అర్హత వయసును 21ఏళ్లకు తగ్గించడంతో మయాంక్ న్యాయమూర్తి కాగలిగాడు.దేశ చరిత్రలోనే తొలిసారి న్యాయవ్యవస్థలో ఆసక్తిక సన్నివేశం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు.

టార్గెట్ రీచ్ అయ్యాడిలా!
న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో.. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారనే ప్రశ్నకు ‘ప్రతీరోజూ 12 నుండి 13 గంటలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది.. ఓ మంచి న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో, పట్టుదలతో రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ 2018 పరీక్షను క్లియర్ చేశాను. మంచి న్యాయమూర్తి కావడానికి నిజాయితీ చాలా ముఖ్యమైన లక్షణం’ అని మాయాంక్ తెలిపాడు. ఈ మాటలు విన్న అందరూ ఆయన్ను మెచ్చుకుంటున్నారు. మయాంక్‌కు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.