జ‌న‌వరి 20 నుంచి హిట్ కాంబినేష‌న్ చిత్రం

  • IndiaGlitz, [Monday,November 27 2017]

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగదాస్, త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్ లది సూపర్ హిట్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే తుపాకి, క‌త్తి (ఖైదీ నెం.150 ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) చిత్రాల‌తో ఈ ఇద్ద‌రు రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ముచ్చటగా మూడోసారి హాట్రిక్ విజయంకోసం ఈ ద్వయం ప్రయత్నిస్తోంది.

గత కొద్ది రోజులుగా వీరి సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. జనవరి 20వ తేదీనుంచి సినిమా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. వచ్చే ఏడాది జూలై 19 కల్ల షూటింగ్ ని పూర్తి చేసి దసరాకి సినిమాని బరిలో దించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు ('తుపాకి', 'కత్తి') సూపర్ హిట్స్గా నిలవడం.. అలాగే విజయ్ 'మెర్సల్' ఘన విజయం సాధించడంతో ఈ సినిమా పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. హీరోయిన్ ఇంకా ఎంపిక కాని ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించ‌నుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కానుంది.