దసరాకు 'జీ 5'లో విడుదలైన 'రాజ రాజ చోర'కు హిట్ టాక్

  • IndiaGlitz, [Thursday,October 14 2021]

'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ 5' కృతజ్ఞతలు చెప్పింది.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా 'రాజ రాజ చోర' చూడమని ప్రజలకు చెప్పారు. కుటుంబ సభ్యులతో ఈ సినిమా చూడమని దర్శకుడు శ్రీవాస్ తన కోరితే... సీనియర్ రచయిత గోపి మోహన్ ఈ సినిమా ఒక 'జెమ్' అని అభివర్ణించారు. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు.

టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుండి డిజిటల్ మీడియా వరకు... ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది.

అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుండి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.

More News

ప్రభాస్ 25లో హీరోయిన్‌గా కరీనా కపూర్..?

పాన్ ఇండియన్ స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ .. వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే..

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో చాటున ఏడ్చేసిన శ్వేతా, ప్రియా బూతులు

'బిగ్‌ బాస్' 5 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా వుంచిన శ్రీయా..గర్వంగా వుందన్న మంచు లక్ష్మీ

డేటింగ్, పెళ్లి వంటి వాటిని రహస్యంగా వుంచి చిత్ర సీమకు షాకిచ్చిన శ్రీయా.. తల్లయిన విషయాన్ని కూడా అలాగే దాచిపెట్టింది.

'పంచతంత్రం' టీజర్ విడుదల చేసిన టీమ్

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి-కాజల్‌పై యానీ మాస్టర్ ఫైర్.. ఒకరిపై ఒకరుపడ్డ జెస్సీ-శ్వేత

బిగ్‌బాస్‌ 5 తెలుగు ఆరో వారంలోకి ప్రవేశించడంతో గేమ్‌ మరింత రసవత్తరంగా మారింది.