కళ్లార్పలేనంత థ్రిల్.. ‘హిట్’ పక్కానేమో!?

  • IndiaGlitz, [Friday,January 31 2020]

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్’. ‘ది ఫ‌స్ట్ కేస్’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శక‌త్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఇప్పటికే నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా తాజాగా.. టీజర్‌ను రిలీజ్ చేశారు.

టీజర్‌లో ఏముంది!?
ఒక ఛేజింగ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ప్రాణం పెట్టే ఓ యువకుడు.. ప్రయాణంలో త‌న‌కు ఎదురైన ప్రమాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ఒడిదుడుకుల ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టు టీజర్‌ని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా.. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా.. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుందని తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే.. రుహానీ శర్మ రొమాంటిక్ సీన్స్‌‌తో అలరించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

డైలాగ్స్ అదుర్స్!
‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌లో పెడుతుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోవాలి’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌తో చెబుతుంది. ‘ఈ డిపార్ట్‌మెంట్‌ని మాత్రం వదిలేది లేదు’ అని విశ్వక్ అదిరిపోయే డైలాగ్ చెబుతాడు. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు బాగా కావాల్సిన వారిని కళ్లముందే కత్తితో పొడిచి చంపేస్తారు. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ రసవత్తరంగా సాగింది. మొత్తానికి చూస్తే కళ్లార్పలేనంత థ్రిల్‌గా ఉంది. సినిమా మాత్రం పక్కా ‘హిట్’ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. కాగా.. ఈ ‘హిట్’ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇదివరకు చిత్రబృందం ప్రకటించింది.

More News

మరోసారి డ్యూయెల్ రోల్‌లో ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

సీరియస్ ప్లానింగ్‌లో అల్లు అర‌వింద్‌?

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ సినీ రంగంతో పాటు రీసెంట్‌గా  డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

పవన్ కు షాక్ .. జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. జేడీ ఎస్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న 'మైదాన్'

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’ సిస్టమ్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ ఎయిర్‌పోర్టులో లగేజ్ విషయంలో