'భరత్ అనే నేను'.. మే 4 నుంచి 'హోలీ' ఫైటింగ్ సీన్

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవ‌ల‌ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన‌ ఈ చిత్రంలో మహేశ్ ప్ర‌ద‌ర్శించిన‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మహేశ్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఓ యాక్షన్ సన్నివేశాన్ని జోడించాలని నిర్మాణ వర్గాలు నిశ్చయించుకున్నాయి. నిడివి కారణంగా ‘హోలీ’ పండుగ ఫైటింగ్ సీన్‌ను తొలగించినట్లు గతంలో దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే.. దాన్ని మళ్ళీ జోడించే అవకాశం కూడా ఉందని ఇటీవ‌ల దర్శకుడు తెలిపారు.  అన్నట్టుగానే ఆ ఫైటింగ్ సీన్‌ను త్వ‌ర‌లోనే సినిమాలో మ‌ళ్ళీ జోడించనున్నారు. అదనంగా జోడించిన ఈ కొత్త సీన్.. మే 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రానికి.. ఈ యాక్షన్ సన్నివేశం ఏ మేర హెల్ప్ అవుతుందో చూడాలి.

More News

నెల‌కో సినిమాతో గోపీసుంద‌ర్‌

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాసిక్ ఫిల్మ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సంగీత దర్శకుడు గోపి సుందర్.

విలన్‌ గా మారిన‌ రచయిత

అబ్బూరి రవి.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు. మాటల రచయితగా 'ఎలా చెప్పను'తో టాలీవుడ్‌కు పరిచయమైన ర‌వి.. పాతిక సినిమాలకు పైగా మాటలను అందించారు.

మనాలీ కి కొలీవుడ్ ఆఫర్

స్వాతి, శ్రీ దివ్య, ఆనంది.‌.  వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్  కధానాయికలుగా వెలుగొందినవారు.

రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ ‘సాహో’.