'మహానటి' కోసం హాలీవుడ్ కెమెరామెన్!!

  • IndiaGlitz, [Friday,July 07 2017]

లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ "మహానటి". ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కంటెంట్ పరంగానే కాక క్వాలిటీ పరంగానూ అద్భుతమైన ఔట్ పుట్ తీసుకురావడం కోసం చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. అందుకోసమే హాలీవుడ్ కెమెరామెన్ డానీ సంచేజ్-లోపెజ్ ను యూనిట్ లో భాగస్వాములను చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. "పలు ఇంటర్నేషనల్ యాడ్స్-మ్యూజిక్ వీడియోస్ మరియు డాక్యుమెంటరీస్ ను చిత్రీకరించిన ప్రముఖ హాలీవుడ్ కెమెరా టెక్నీషియన్లు డానీ సంచేజ్-లోపెజ్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్ "మహానటి" చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా రియలిస్టిక్ గా కనిపించడానికి ఈయన పనితనం బాగా ఉపయోగపడుతుంది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది" అన్నారు.

More News

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...'

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది.విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదల కాబోతోంది.

'అనగనగా ఒక ఊళ్ళో' ఫస్ట్ లుక్ లాంచ్!

చంద్ర బాలాజీ ఫిలింస్ పతాకంపై అశోక్ కుమార్,ప్రియావర్మ జంటగా సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో

తమిళనాడులో థియేటర్స్ బంద్ విరమణ...

కేంద్ర ప్రభుత్వం విధించిన సినిమా టికెట్స్ పై 30 శాతం పన్నును రద్దు చేయాలంటూ థియేటర్స్ యజమానులు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో 'సంతోషం' సౌత్ ఇండియన్ 16వ ఫిల్మ్ అవార్డ్సు వేడుక

సంతోషం ఇప్పుడు నవజవ్వనిగా టీనేజిలోకి ప్రవేశించింది.పదిహేనేళ్ల వయసంటే అందంగా అందరినీ అలరించడమే.

నా 75 సంవత్సరాల జన్మదిన సంచికను పుస్తకరూపంలో తేవడం ఆనందంగా వుంది - సూపర్స్టార్ కృష్ణ

తెరపై హీరోలను చూసి వారి సినిమాలను ఆదరించి వారిని అభిమానిస్తారు. కొంతమంది అయితే ఆ హీరోనే ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీగా వుంటారు.