'ఆర్‌ఆర్‌ఆర్‌'లో షూట్‌లో జాయిన్‌ అయిన  హాలీవుడ్‌ స్టార్స్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత పునః ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో హాలీవుడ్‌ యాక్టర్స్‌ రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడీ జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని అలిసన్‌ డూడీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్స్‌లో స్కాట్‌ అండ్‌ లేడీ స్కాట్‌ అంటూ మెసేజ్‌ చేసింది అలిసన్‌. మరి ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ సరసన నటించబోయే ఒలివియా మోరిస్‌ ఎప్పుడు జాయిన్ అవుతుందో తెలియడం లేదు. స్కాట్‌ అంటే బ్రిటీష్‌ అధికారి పోజిషన్‌ పేరు, స్కాట్ భార్య లేడీ స్కాట్‌ అని అర్థం వస్తుంది.

ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాలో కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్‌ ఇతర తారలు కొందరు తదుపరి షెడూల్‌లో జాయిన్‌ అవుతున్నారు.రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్టోరీ ఇదేనట...

నేచురల్ స్టార్ నాని లాక్‌డౌన్ తర్వాత మరింత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుని షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు.

వారిని మెప్పించిన పార్టీకే జీహెచ్ఎంసీ పీఠం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో తెలీదుగానీ., ఖ‌చ్చితంగా ఎఫ్‌ 3తో నవ్వుల వ్యాక్సిన్ వ‌స్తుంది - డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి

ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. పటాస్‌.. సుప్రీమ్‌.. రాజాదిగ్రేట్‌.. ఎఫ్‌2... సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకటి కాదు రెండు కాదు.

‘శ‌శిక‌ళ’ బ‌యోపిక్‌పై ఆర్జీవీ అప్‌డేట్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస  సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ.. వాటిని పూర్తి చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు.

'ప్రత్యర్థి' చిత్రం ప్రారంభం!!

రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్, అక్షిత సొనవనే ప్రధాన పాత్రధారులుగా గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై