close
Choose your channels

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

Tuesday, June 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను త‌న సొంతం చేసుకున్నారాయ‌న‌.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం చిరు త‌న 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌బచ్చన్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో ఏక‌ధాటిగా 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించే యాక్ష‌న్ ఏపిసోడ్స్‌ను ఫ్యాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, స్కై ఫాల్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ చేసిన గ్రెగ్ పావెల్ కంపోజ్ చేస్తున్నారట‌. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.