ఆ ఫోన్ తెచ్చిస్తే రూ. 4 లక్షలిస్తాం.. హానర్ కంపెనీ బంపరాఫర్!

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. ఇదేంట్రా బాబు మహా అంటే ఆ ఫోన్ విలువ ఏ పాతికో ఉంటుందంతేగా కొత్త ఫోన్ కొనుక్కోకుండా నాలుగు లక్షలు ఇవ్వడమేంటని కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే మరి. ఇంత హానర్ సంగతేంటి..? ఆ నాలుగు లక్షల సంగతేంటి..? హానర్ కంపెనీ ఎందుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేం జరిగింది.. ఎక్కడ మిస్సైంది!

ఇదిగో ఈ ఫొటోలో మీరు చూస్తున్న హానర్ ఫోన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. అంటే ఇంకా లాంచ్ కాలేదని అర్థం. అయితే ఈ ఫోన్ మిస్ అయింది. ఇది మిస్సవడంతో జర్మన్‌కు చెందిన మొబైల్ మేకర్ హువావే సబ్ బ్రాంబ్‌ అనే హానర్ ఉద్యోగి చిక్కుల్లో పడ్డాడు. ఈ మిస్సయిన ఫోన్‌ను ఎవరైనా తిరిగి తెచ్చిస్తే రూ. 4లక్షలు బహుమానంగా ఇస్తానని సదరు కంపెనీ ట్విట్టర్‌లో ప్రకటించింది. కాగా.. రెండ్రోజుల క్రితం హువావే ఈ ఫోన్‌‌ను మ్యూనిచ్‌ రైళ్లో వెళ్తుండగా మిస్ చేసుకున్నాడు. అప్‌కమింగ్ ఫోన్ సంగతి ఎంత వరకు వచ్చింది..? ఎప్పుడు సబ్‌మిట్ చేస్తున్నారు..? అని హానర్ కంపెనీ యాజమాన్యం అడగడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆ ఉద్యోగి జుట్టు పీక్కుంటున్నాడు. అసలు విషయం చెప్పడంతో అలెర్టయిన హానర్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పై విధంగా ప్రకటన చేసింది.

హానర్ చేసిన ప్రకటన ఏంటి..!?

మా సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు డస్సెడ్రాఫ్‌ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు ఐసీఈ 1125 రైలులో ఏప్రిల్‌ 22న వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్ బూడిద రంగులో ఉంది.. దీనికి కవర్ కూడా ఉంది. ఈ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిన వారికి 5.000 ఈరోలు అనగా రూ. 4లక్షలు బహుమానంగా ఇస్తాం అని హానర్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అంతటితో ఆగని ఆ కంపెనీ వచ్చే నెల 21లోపే తీసుకురావాలనీ.. ఆ తర్వాత తాము తీసుకోబోమని హానర్ షరతు కూడా పెట్టింది.

మిస్సయిన్ ఫోన్ మోడల్ ఇదే..!

మిస్సయిన్ ఫోన్ మోడల్ .. హానర్ 20 సిరీస్. ఈ ఫోన్ మే 21న లండన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో హానర్ 20 సిరీస్‌లోని పలు మోడల్స్ ను విడుదల చేయనుంది. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో హానర్‌ 20, హానర్‌ 20 ప్రో, హానర్‌ 20ఏ, హానర్‌ 20సీ, హానర్‌ 20 ఎక్స్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.