స‌మంత మార‌లేదు...అలాగే ఉంది..!

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తికాలంలోనే తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న ముద్దుగుమ్మ స‌మంత‌. ఇటీవ‌ల జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌మంత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు సైన్ చేయ‌లేదు. దీనికి కార‌ణం నాగ‌చైత‌న్య‌ను త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంది. అందుచేత‌నే స‌మంత‌ సినిమాలు అంగీక‌రించ‌డం లేదు అనుకున్నారు. అయితే...ఈరోజు స‌మంత ట్విట్ట‌ర్ లో త‌ను సినిమాలు అంగీక‌రించ‌క‌పోవ‌డం పై స్పందిస్తూ...సౌత్ లో హీరోయిన్స్ కు అర్ధ‌వంత‌మైన పాత్ర‌లు ల‌భించ‌డం ఎంత క‌ష్ట‌మో అర్ధ‌మైంది. నేను సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి గ‌ల ఒకే ఒక్క కార‌ణం మంచి పాత్ర‌లు ల‌భించ‌క‌పోవ‌డ‌మే అని తెలియ‌చేసింది.

అయితే...స‌మంత సమాధానంతో చాలా మందిలో చాలా ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి..! అవి ఏమిటంటే... ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ మీనింగ్ ఫుల్ సినిమాలే చేసిందా..? మీనింగ్ ఫుల్ సినిమాలే చేసుంటే...స‌డ‌న్ గా ఇప్పుడు ఎందుకు అలాంటి పాత్ర‌లు రావ‌డం లేదో..అర్ధం కావ‌డం లేదు..! అయినా ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు అని ఎవ‌రైనా స‌మంత‌ని అడిగి ఉంటే వాళ్ల‌కు డైరెక్ట్ గానే స‌మాధానం చెప్ప‌చ్చు క‌దా..! ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్ప‌డం ఎందుకో..? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు...! స‌మంత చెప్పిన‌దాంట్లో నిజం ఉందో లేదో తెలియ‌దు కానీ...స‌మంత మార‌లేదు ఇది మాత్రం నిజం..!

More News

అభినేత్రి నిర్మాత ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్..!

గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం, అభినేత్రి చిత్రాల నిర్మాత, ఎం.వి.వి బిల్డ‌ర్స్ అధినేత ఎం.వి.వి. స‌త్యనారాయ‌ణ‌ను భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ పై విశాఖ‌ప‌ట్నం పోలీసులు అరెస్ట్ చేసారు.

వెంకీ గురు ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం సంతోషంగా ఉంది - సాగ‌ర్

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన సిద్దార్ధ చిత్రం ఈనెల 16న రిలీజైంది.

చిరంతన్‌ భట్‌ సంగీత దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' పాట చిత్రీకరణ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా నందిని న‌ర్సింగ్ హోమ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ హీరోగా గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్.