ర‌వితేజ చిత్రంలో హాట్ యాంక‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. క్రమంగా ఈ హాట్‌ యాంక‌ర్ ఇమేజ్ బుల్లితెర నుండి వెండితెర‌పై కూడా అడుగు పెట్టారు. ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు, స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించారు. అన‌సూయ న‌టించిన చిత్రాల్లో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల్లో అన‌సూయ పోషించిన పాత్ర‌ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు అన‌సూయ‌ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు అనసూయ మాస్ మ‌హారాజా ర‌వితేజ 67వ చిత్రం ‘ఖిలాడి’లో చంద్ర‌క‌ళ అనే కీల‌క పాత్ర‌ను పోషించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మరి ఈ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

క్రాక్ సినిమా త‌ర్వాత ర‌వితేజ చేస్తున్న ఈ సినిమాకు ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

More News

ఆ రెండు చోట్ల ప్లాన్ చేస్తున్న కాజ‌ల్‌!

దశాబ్దంపైగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపాదడపా చేసిన హిందీ చిత్రాలతో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

ఏపీలో కొత్త జిల్లాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్

ఇటీవల కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో

మ‌ళ్లీ హీరోగా సునీల్‌..?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తా.. బీజేపీ ఎంపీ శపథం

రాష్ట్రమంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే తిరిగి హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం రూపంలో