close
Choose your channels

ఏపీ బడ్జెట్ లెక్కలివీ.. అమరావతికి ఎంత కేటాయించారంటే..!

Friday, July 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ బడ్జెట్ లెక్కలివీ.. అమరావతికి ఎంత కేటాయించారంటే..!

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,27,974.99 కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. కాగా.. రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు. రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. మహాత్ముని లక్ష్యం సాధించే దిశగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల హామీలో ఓ దృక్పథం ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

బుగ్గన ప్రసంగంలో ముఖ్యాంశాలు..

మేనిఫెస్టో మాకొక నియమావళి
మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తాం
అన్ని రంగాల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం
రాయలసీమకు నీరు అందిస్తాం
ఉత్తరాంధ్రలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
సాగునీటి రంగంలో అవినీతిని అరికట్టేందుకు జుడీషియల్‌ కమిషన్‌
పేదల కన్నీటిని తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు
ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం
జన్మభూమి కమటీలకు, మా ప్రభుత్వానికి తేడా ఉంది
ప్రతి గ్రామానికీ తాగునీరు
అన్ని కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తాం
గోదావరి జలాల్ని రాయలసీమకు తీసుకొస్తాం

లెక్కలు ఇవీ..

రూ.2 లక్షల 27 వేల 974 కోట్లతో ఏపీ బడ్జెట్‌
రెవెన్యూ లోటు- రూ.1,778.52 కోట్లు
19.32 శాతం పెరిగిన బడ్జెట్‌ అంచనా
రెవెన్యూ వ్యయం 20.10శాతం పెరుగుతుందని అంచనా

దేనికెంత కేటాయించారు..!

సాగునీటిశాఖకు రూ.13,139 కోట్లు కేటాయింపు
అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు
ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
రాజధాని అమరావతికి రూ.500 కోట్లు కేటాయింపు
విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8, 750 కోట్లు

9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు
ఫసల్‌ బీమా యోజనకు రూ.1,163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీకి రూ.475 కోట్లు
వైఎస్సార్‌ బోర్‌వెల్‌ పథకానికి రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్లు
స్కూళ్లలో మౌలిక వసతులకు రూ.1,500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి రూ.1,077 కోట్లు

ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు

ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1,500 కోట్లు
వైఎస్‌ఆర్‌ పాఠశాల నిర్వహణ గ్రాంట్‌- రూ.160 కోట్లు
ఆశావర్కర్ల గౌరవ వేతనం రూ. 456 కోట్లు
వైఎస్సార్‌ గిరిజన మెడికల్‌ కాలేజీకి రూ. 66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి రూ.66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి రూ.66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు రూ. 50 కోట్లు
వైఎస్సార్‌ గృహ వసతికి రూ. 5 వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1,370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు రూ.1,280 కోట్లు
వైఎస్సార్‌ అర్బన్‌ హౌసింగ్‌కు రూ. వెయ్యి కోట్లు

వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు రూ.300 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు
వైఎస్సార్‌ బీమాకు రూ. 404 కోట్లు
బియ్యంపై సబ్సిడీకి రూ.3 వేల కోట్లు
గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు
మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు
మున్సిపల్‌ వార్డు సెక్రటేరియట్‌కు రూ.180 కోట్లు
ఏపీఐఐసీకి రూ.360 కోట్లు
కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.573 కోట్లు

చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.200 కోట్లు
చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.200 కోట్లు
ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద రూ.500 కోట్లు
ఉపాధిహామీ పథకానికి రూ.500 కోట్లు
పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.300 కోట్లు
విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ. 200 కోట్లు
ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు
ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.1,140 కోట్లు
పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ.648 కోట్లు

ఇరిగేషన్‌, వరద ముంపు నివారణకు రూ.13,139 కోట్లు
వ్యవసాయానికి రూ.20,677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు
విద్యుత్‌- రూ.6,861 కోట్లు, రవాణా- రూ.6,157 కోట్లు
ఇండస్ట్రీ మినరల్స్‌కు రూ.3,986 కోట్లు
జనరల్‌ ఎకో సర్వీసెస్‌ రూ.6,025 కోట్లు
సాధారణ విద్య- రూ. 32,618 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329 కోట్లు
సాంకేతిక విద్య- రూ. 580 కోట్లు, సాంస్కతికశాఖకు రూ. 77 కోట్లు
వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు

నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు
గృహనిర్మాణశాఖకు రూ.3,617 కోట్లు
అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 6,587 కోట్లు
సమాచార, పౌరసంబంధాలశాఖకు రూ. 191 కోట్లు
సంక్షేమశాఖలకు రూ.14,142 కోట్లు
కార్మిక, ఉపాధిశాఖలకు రూ.978 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2, 707 కోట్లు
సాధారణ సర్వీసులకు రూ.66,324 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్, సహకారశాఖలకు రూ.18,327 కోట్లు
పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్య్సశాఖలకు రూ.1,912 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.7,271 కోట్లు
పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.446 కోట్లు
ఉన్నత విద్యకు రూ.3,021 కోట్లు
ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4,988 కోట్లు
ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15 వేల కోట్లు
బీసీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15,061 కోట్లు
నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.300 కోట్లు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.