close
Choose your channels

ఈగో క్లాష్‌

Wednesday, May 8, 2019 • తెలుగు Comments

ఈగో క్లాష్‌

బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోష‌న్‌, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య రిలేష‌న్ పాడై చాలా కాల‌మైంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, కేసులు పెట్టుకోవ‌డం వంటి ప‌నులు చాలానే చేసుకున్నారు. కంగ‌నా ఓ అడుగు ముందుకేసి ఏకంగా మీడియా ముందు హృతిక్‌ని స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏకీ పారేస్తుంది. ఇప్పుడు కంగనా సినిమాల రూపంలో కూడా త‌న కోపాని తీర్చుకోవాల‌నుకుంటుందా? అంటే ప‌రిస్థితి చూస్తే అలాగే ఉందని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఎందుకంటే .. కంగ‌నా ర‌నౌత్ సినిమా 'మెంట‌ల్ హై క్యా?' సినిమా విడుద‌ల‌ను హృతిక్ చిత్రం 'సూప‌ర్ 30'కి పోటీగా రిలీజ్ అవుతుండ‌టమే అందుకు కార‌ణం. హృతిక్‌రోష‌న్ 'సూప‌ర్ 30' సినిమా జూలై 26న విడుద‌ల కానుంది. అదే రోజున కంగ‌నా త‌న సినిమా 'మెంట‌ల్ హై క్యా?' ని రిలీజ్ చేయనుంది. ఈ రెండు సినిమాల జోన‌ర్స్ వేరు. వీటి మ‌ధ్య పోటీ లేకున్నా సినీ వ‌ర్గాల మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఈగో క్లాష్ అని చెప్పుకుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz