close
Choose your channels

వశిష్ట నారాయణ్ సింగ్ అకాల మృతి బాధాకరం : హృతిక్

Friday, November 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వశిష్ట నారాయణ్ సింగ్ అకాల మృతి బాధాకరం : హృతిక్

ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. నలభై ఏళ్లుగా మనోవైకల్యం (డిప్రెషన్స్‌)తో భాధపడుతున్న ఆయన నవంబర్-14న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా.. ఇతను ఐన్‌స్టీస్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని ఆయన ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

చింతిస్తు్న్నా..!

‘భారతదేశంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్తల్లో ఒకరైన వశిష్ట నారాయణ్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన పెద్ద శాస్త్రవేత్త అని గానీ.. చాలా మందికి తెలియదు. బిహార్‌లోని ఓ గ్రామంలో పుట్టిన నారాయణ్ సింగ్ గణితంలో కష్టమైన సమీకరణాలను పరిష్కరించారు. ఆయన అకాల మరణం బాధాకరం.. చింతిస్తున్నాను’ అని ట్వి్ట్టర్ వేదికగా హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ సంవత్సరం ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌ సూపర్-30లో హృతిక్ నటించిన విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.