close
Choose your channels

విష్ణు గెలుస్తాడా..? ప్రకాశ్ రాజ్ గెలుస్తాడా:  మా ఎన్నికలపై ‘‘ కాయ్ రాజ్ కాయ్ ’’

Sunday, October 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విష్ణు గెలుస్తాడా..? ప్రకాశ్ రాజ్ గెలుస్తాడా:  మా ఎన్నికలపై ‘‘ కాయ్ రాజ్ కాయ్ ’’

మా ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు రానున్నాడు. అయితే అధ్యక్ష స్థానం కోసం బరిలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ల మధ్య నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఓట్ల కోసం రెండు ప్యానెళ్ల సభ్యులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లపై రచ్చ జరగ్గా... నిన్న రాత్రి కూడా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఇరు వర్గాలు దుమ్మెత్తిపోసుకున్నాయి.

ఐతే ఎన్నడూ లేని విధంగా వివాదమవుతున్న ఈ మా ఎన్నికల వల్ల ఎవరికి లాభమో కానీ.. బెట్టింగ్ రాయుళ్ళకి మాత్రం ఒక రేంజిలో కలిసొస్తుందట. సార్వత్రిక ఎన్నికలకు మించి కొట్టుకుంటున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల వ్యవహారం జనంలోకి బాగా వెళ్లింది. గతంలో మా ఎన్నికలంటే ఫిలింనగర్‌కు, సినిమా జనాలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ సామాజిక మాధ్యమాలు, మీడియా ప్రభావంతో ప్రజల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీన్నే బెట్టింగ్ రాయుళ్లు సరిగ్గా క్యాష్ చేసుకుంటూ.. పెద్దమొత్తంలో బెట్టింగ్స్‌కి తెరలేపుతున్నట్టు తెలుస్తుంది.

విష్ణు గెలుస్తాడా..? లేక ప్రకాష్ రాజా..? అనే విషయంలో బెట్టింగ్ జరుగుతోంది. నటీనటులు, దర్శకులు, కొంతమంది నిర్మాతలు.. బెట్టింగ్ వేసుకుంటున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అధ్యక్షుడు ఎవరనే విషయంలో మాత్రమే కాదు.. ఏ ప్యానెల్ నుంచి ఎవరు గెలుస్తారు..? అంటూ మిగిలిన సభ్యులపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.