close
Choose your channels

భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

Saturday, October 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. ప్ర‌తి సీన్‌ను తెర‌పై ఆయ‌న ఓ అద్భుతంగా ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చే్స్తుంటారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌టాయ‌న‌. వివరాల్లోకెళ్తే.. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `భార‌తీయుడు 2`. 23 ఏళ్ల‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన `భార‌తీయుడు` సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను బోపాల్‌లో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఇదొక యాక్ష‌న్ ఏపిసోడ్. దాదాపు రెండు వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొనే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం 40 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ట‌. ఓ ఫైట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయ‌డమంటే షాకింగ్ విష‌య‌మే. అయినా కూడా.. నిర్మాత‌ల‌ను క‌న్విస్ చేసి శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాడు. ఈ షెడ్యూల్‌ను బోపాల్‌లో 25 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు.

శంక‌ర్‌కు ఒక‌ప్పుడు నిర్మాత‌లు అడిగినంత బ‌డ్జెట్‌ను ఇవ్వ‌డానికి రెడీ అన్నారు. కానీ ఆయ‌న 2.0 సినిమా స‌రైన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డంలో విఫ‌లం కావ‌డంతో `భార‌తీయుడు 2` బ‌డ్జెట్ విష‌యంలో ప‌రిమితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ సినిమా కోసం ఓ ఫైట్ కో్సం న‌ల‌భై కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్ట‌డ‌మ‌నేది శంక‌ర్‌కు కాస్త త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే. అయితే మిగిలిన చోట్ల బ‌డ్జెట్‌ను కుదించి ఈ ఫైట్‌ను లావిష్‌గా చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. పీట‌ర్‌హెయిన్స్ మాస్ట‌ర్ ఈ ఆధ్వ‌ర్యంలో ఈఫైట్‌ను చిత్రీక‌రిస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.