దిమ్మ తిరిగే రేంజ్లో బిగ్‌బాస్ రెమ్యునరేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కొక్క సినిమాకే మన టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ పాతిక కోట్లు దాటడం లేదు. అలా దాటితేనే అబ్బో అని అనేస్తున్నారు. కానీ బాలీవుడ్ దబాంగ్ స్టార్ సల్మాన్ భాయ్ రేంజ్ మరోలా ఉంది. ఈయన వ్యాఖ్యాతగా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 13వ సెషనల్ సెప్టెంబర్ 29న ప్రారంభం కానుంది. సల్మాన్ చేస్తున్న 10వ సెషన్ ఇది.
ఈ మొత్తం సెషన్‌కు సల్మాన్ రూ.400 కోట్లను డిమాండ్ చేశాడట. సల్మాన్ వ్యాఖ్యానం చేస్తే తమ షో రేటింగ్ టాప్‌లో ఉంటుంది కాబట్టి.. అంత భారీ మొత్తమైనా నిర్వాహకులు ఇవ్వడానికి రెడీ అయ్యారట. 2020 జనవరి 10న ఈ సెషన్ గ్రాండ్ ఫినాలే జరగనుందని టాక్. షో సంగతిని పక్కన పెడితే సల్మాన్ భారీ రెమ్యునరేషన్ గురించి బాలీవుడ్లో పెద్ద చర్చే జరుగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.