‘ఆచార్య’ కోసం రూ.20 కోట్లతో భారీ సెట్...

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'ఆచార్య'. ఈ కాంబినేషన్‌ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. కాగా.. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌ తర్వాత తాజాగా పునః ప్రారంభమైంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింగనర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఈ సెట్‌ను వేసినట్టు తెలుస్తోంది.

రూ.20 కోట్ల ఖర్చుతో ఈ సెట్ వేస్తున్నారని సమాచారం. మొత్తంగా 16 ఎకరాల్లో ఈ భారీ సెట్‌ రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సెట్‌లో సినిమాకు సంబంధించిన మేజర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారని టాక్ నడుస్తోంది. కాగా.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ వేస్తున్న రెండో భారీ సెట్ కావడం విశేషం. గతంలో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్‌లో కూడా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడి సెట్‌ వేసి చిత్రీకరణ చేశారు. ఈ గుడి ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం.

దేవాదాయశాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై మెగాస్టార్ పోరాడనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌ పాత్రలో నటిస్తున్నారు. కాగా.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నక్సలైట్‌ నాయకుడిగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా విడుదల కోసం చిరు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More News

తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్..

జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

నేడు గ్రేటర్ పరిధిలో బొమ్మ పడనుంది...

కొవిడ్‌ మహమ్మారి కారణంగా మూతపడిన మల్టీప్లెక్స్‌లు ఎట్టకేలకు శుక్రవారం తెరుచుకోనున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపుతో 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం..

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్లు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

పట్టు వదలని విక్రమార్కుల్లా అఖిల్, సొహైల్...

‘పట్టి పట్టి నన్నే సూస్తంటే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రేస్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్‌ మొదలైంది. అభి.. సంచాలకుడు.