close
Choose your channels

‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

రోజురోజుకు పెరుగున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా యాప్‌లు అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. కొన్ని యాప్‌ల వల్ల జనాలు ప్రాణాలు మీదికి తెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. కాగా ఈ మధ్య విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’. సినిమాల్లోని పాటలు.. డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేసేస్తున్నారు. మరికొందరైతే మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా ‘టిక్‌టాక్’లో వీడియోలను తయారు చేస్తున్నారు. మరికొందరు 24/7 ఈ టిక్ టాక్ వీడియోలతో గడిపేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో వివాదాలు సైతం తలెత్తాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్ చేయగా.. మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించాయి.

ఇదిలా ఉంటే తాజాగా.. టిక్ టాక్‌లో భార్య వీడియోలు చేస్తోందని.. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవై సమీపంలో చోటుచేసుకుంది. అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్‌ (35) బిల్డింగ్‌లు కట్టే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య నందిని(28) స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కుటుంబ తగాదాల కారణంగా కనకరాజు, నందిని రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నందిని కొన్ని నెలలుగా ‘టిక్‌టాక్‌’కు బానిసగా మారి రోజూ వీడియోలు చేస్తూ పోస్ట్ చేసేది.

దీంతో ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున లైక్స్.. ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరగిపోయింది. అయితే ఈ వీడియోలు చూసిన భర్త విసుగుచెంది.. ఆమెకు ఫోన్ చేసి ‘టిక్‌టాక్’ వీడియోలు చేయొద్దంటూ పలుమార్లు హెచ్చరించాడు. వీడియోలు చేయడం మాని ఇంటికొచ్చి కాపురం చేయాలని కోరాడు. అయితే భర్త మాటలను పట్టించుకోకుండా ఆమె ‘టిక్ టాక్’ వీడియోలతోనే పబ్బం గడిపేస్తోంది. దీంతో ఆగ్రహించిన భర్త కనకరాజ్‌ మద్యం సేవించి నందినికి ఫోన్ చేశాడు.

ఆ సమయంలో నందిని ఫోన్ బిజీ అని వస్తుండడంతో.. భార్య పని చేస్తున్న కళాశాలకి వచ్చి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణకు దారిదీయడంతో తీవ్ర ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి నందిని దారుణంగా హత్య చేశాడు.  దీంతో నందిని తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది.

నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కనకరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో.. ఇలాంటి యాప్‌లకు బానిస కావడం వల్ల నష్టమే కానీ పైసా ప్రయోజనం లేదని తెలుసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.