హుజూర్ నగర్ ఉపఎన్నికకు మోగిన నగారా.. అక్టోబర్ 21న ఎన్నిక

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

హుజూర్ నగర్ ఉపఎన్నిక నగారా మోగింది. హుజూర్ నగర్ అసెంబ్టీ స్థానం పోరుకు షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికలు సంఘం నిర్ణయించింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదల కానుండగా... అక్టోబర్ 4 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 21న పోలింగ్ జగరనుండగా.... అక్టోబర్ 24న ఫలితాలు విడుదల కానున్నాయ్.

కాగా.. 2018లో జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే... తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయకేతనం ఎగరేశారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉపఎన్నికల నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే... హుజూర్ నగర్ లో ఓడిపోయిన టీఆర్ఎస్ ఎలాగైనా గులాబీ జెండా పాతాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందులాగే విజయకేతనం ఎగరేయాలని చూస్తోంది. కానీ... టికెట్ గురించి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.