హైదరాబాద్‌‌లోని మహిళా పోలీసులకు ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Tuesday,March 08 2022]

హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించని సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. వచ్చీ రాగానే డ్రగ్స్ మాఫియా ఆటకట్టించడంపై దృష్టి సారించిన ఆయన రెండు స్పెషల్ వింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన నారీమణులపై సీవీ ఆనంద్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. హైదరాబాద్ నగర పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీస్ అధికారులకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించనున్నారు.

దీనికోసం సివి ఆనంద్ 1200 టికెట్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం . ఈరోజు సాయంత్రం మహిళా పోలీసులు హైదరాబాద్ లోని జివికె మాల్ లో భీమ్లా నాయక్ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించబోతున్నారు. భీమ్లా నాయక్‌లో మహిళలకు ప్రాధాన్యత కనిపించిందని సివి ఆనంద్ ప్రశంసించారు. మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అంత సులువు కాదని.. కానీ చాలా మంది మహిళలు పోలీస్ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని కమీషనర్ కొనియాడారు.

ఇక సినిమాల్లో కూడా పోలీసులని, మహిళా పోలీసులని శక్తివంతంగా చూపిస్తూ... మహిళల ప్రాముఖ్యత తెలియజేస్తున్నారని సీవీ ఆనంద్ అన్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో నటి మౌనిక రెడ్డి .. పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా కీలక పాత్రలో నటించింది. కథలో భాగంగా పవన్ తో పాటు ఆమె కూడా చిక్కుల్లో పడుతుంది. పతాక సన్నివేశాల్లో పవన్ మహిళలను ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే సీవీ ఆనంద్ ఈ సినిమాను మహిళా పోలీసులకు చూపించాలని నిర్ణయించి వుండవచ్చు.

ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు

More News

రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

జగన్ కీలక నిర్ణయం.. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు, అసెంబ్లీలో ప్రకటన

ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి మరణంపై ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో

ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తా... సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు సినీ ప్రముఖులు.. సీఎం జగన్ సహా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు కూడా.

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్... దళితబంధుకు ప్రాధాన్యత, ఏ రంగానికి ఎంతంటే..?

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: బీజేపీకి షాక్.. సభ నుంచి ఈటల, రాజాసింగ్, రఘునందన్‌లు సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజే బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు‌లు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు