close
Choose your channels

'హైదరాబాద్ లవ్ స్టొరీ' ఫిబ్రవరి 23న రిలీజ్

Sunday, February 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ, రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్, జియా, రావు రమేష్, సూర్య, సన మిగతా భారి తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించగా సునీల్ కశ్యప్ సంగీతం ప్రధాన ఆకర్షణ, ఎడిటింగ్ ఏం.ఆర్ వర్మ, కెమెరా బి.వి అమర్ నాథ్ రెడ్డి, నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్ల.

ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఆడియెన్స్ అండ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రేక్షకులలో సినిమా పట్ల మంచి అంచనాలే నెలకొల్పింది. కాగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ''మా సినిమాను భారి అంచనాల మధ్య ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు తిసుకోస్తున్నాం, ఎల్లప్పుడూ మంచి సినిమాలను ఆధరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా ఘన విజయం చేస్తారని బలంగా నమ్ముతున్నాం '' అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.