జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా...

  • IndiaGlitz, [Sunday,July 26 2020]

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రామ్మోహన్ తన కుటుంబ సభ్యులతో పాటు పరీక్షలు చేయించుకోగా.. ఆయన కుటుంబ సభ్యులకు నెగిటివ్ రాగా.. ఆయనకు మాత్రం కరోనా ఉన్నట్టు తేలింది. గతంలో రామ్మోహన్ రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నప్పటికీ రెండు సార్లూ నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. ఈసారి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయనకు కరోనా నిర్ధారణ కావడం గమనార్హం.

ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి మేయర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బొంతు రామ్మోహన్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానానికి బొంతు రామ్మోహన్ అంగీకరించారు.