Hyderabad Metro : మీరు రెగ్యులర్‌గా మెట్రోలో ప్రయాణిస్తారా.. అయితే మీకు ‘‘బోనస్’’, ఈ ఐడీల వారికే...!!

  • IndiaGlitz, [Friday,November 25 2022]

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తోంది. కరోనాకు ముందు ప్రతినిత్యం లక్షల్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు సేవలందించిన మెట్రోకు... కోవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుస లాక్‌డౌన్‌లకు తోడు.. మహారాజ పోషకుల్లాంటి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు కావడంతో హైదరాబాద్ మెట్రో వెలవెలబోయింది. దీంతో తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మెట్రో యాజమాన్యం కోరింది. అయితే తర్వాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కార్యాలయాలు తెరుచుకోవడంతో మెట్రో మునుపటి ఫామ్‌ని అందుకుంది.

హైదరాబాద్ మెట్రోకు ఐదేళ్లు :

ఇదిలావుండగా.. మెట్రోని ఏళ్లుగా ఉపయోగిస్తున్న వారికి హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రోను ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా లాయల్టీ బోనస్ ప్రకటించింది. దీనికి సంబంధించి విశ్వసనీయ ఖాతాదారుల పేరుతో కొన్ని స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్టును విడుదల చేసింది. మెట్రో అధికారులు విడుదల చేసిన ఈ ఐడీలలో ఏదైనా మీ దగ్గర వుంటే.. దగ్గరలోని మెట్రో స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపింది.

ఆ ఐడీలు ఏంటంటే:

10100003890119, 101000010715659, 10100001417850, 10100004374980, 10100000006433, 10100001930276, 10100002449022, 101000011214385, 10100002975875 మీ ఐడీ నెంబర్ ఇందులో ఉంటే.. మీకు లాయల్టీ బోనస్ వచ్చినట్లే. మరి ఇంకేందుకు లేటు.. వెంటనే చెక్ చేసుకోండి మరి. మీ వివరాలను నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు పంపించాలని మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఈ ఐడీలను కాల్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.

More News

ఒసేయ్ రాములమ్మ సినిమాని గుర్తుచేసిన బాలకృష్ణ - థమన్‌ల జై బాలయ్య

ఇదిలావుండగా... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న వీర సింహారెడ్డికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా

Mahabharatam Movie : సౌత్ స్టార్స్ మహాభారతం చేస్తే.. ఏ రోల్ ఎవరికంటే, వీడియో వేరేలెవల్ అసలు..

ఇతిహాసలైన రామాయణం, మహాభారతాలు భారతీయులకి తరాలు మారినా, యుగాలు గడిచినా స్పూర్తిగా నిలుస్తాయి.

Ghost: 'ఘోస్ట్' కొత్త పోస్టర్ విడుదల

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Ukku Satyagraham : 'ఉక్కు సత్యాగ్రహం' ఆడియో విడుదల

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు

Aha Naa Pelanta: 50 మిలియన్ వ్యూయింగ్‌ మినిట్స్ సాధించిన జీ 5 ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్ళంట’

జీ5లో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్ళంట’. న‌వంబ‌ర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.